News March 28, 2024
ELECTIONS: వాట్సాప్‌లో ఇవి షేర్ చేస్తున్నారా?
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయ్యే కంటెంట్‌పై అడ్మిన్లు, సభ్యులు అప్రమత్తంగా ఉండాలి. జాతి, మత, కుల వ్యతిరేకమైన కంటెంట్, అసత్య ప్రచారాలు, ధ్రువీకరించని వార్తలు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేవి, హింసను ప్రేరేపించే కంటెంట్, పోర్నోగ్రఫీ కంటెంట్, ఫొటోలు, వీడియోలు షేర్ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
Similar News
News November 6, 2024
దూసుకెళ్తున్న ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ‘అసోసియేట్ ప్రెస్’ ప్రకారం ఆయన ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ 30 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. కమల 5 రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. 40 ఓట్లున్న టెక్సాస్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
News November 6, 2024
త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల
TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్‌లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.
News November 6, 2024
అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.