News November 20, 2024

Elections: వీరి ఆస్తులు రూ.2వేలే!

image

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అజయ్ భోజ్‌రాజ్, విజయ్ మనోహర్, అల్తాఫ్ సయ్యద్ తమ ఆస్తులు కేవలం రూ.2,000 అని అఫిడవిట్లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పేద అభ్యర్థులుగా నిలిచారు. పరాగ్ షా(BJP) రూ.3,383 కోట్లతో రిచ్ కాండిడేట్‌గా ఉన్నారు. నిరక్షరాస్యులు 10, 5వ తరగతి 85, 8th 214, టెన్త్ 313, ఇంటర్ చదివిన వారు 422 మంది ఉన్నారు. PS: HT

Similar News

News December 6, 2024

ఈ నెల 10న కలెక్టరేట్ల ముట్టడి

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 10న కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బకాయిల విడుదలకు అనుకూలంగా ఉన్నా, ఆర్థిక శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క బిల్లు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

News December 6, 2024

కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బ్యాడ్ న్యూస్

image

AP: కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని వార్తలు వచ్చినా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు సివిల్ సప్లైస్ శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతోంది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటోంది.

News December 6, 2024

పోతూ పోతూ ‘RBI దాస్’ గుడ్‌న్యూస్ చెప్తారా!

image

RBI గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం DEC 10న ముగుస్తుంది. మరోసారి అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో చివరి MPC మీటింగులోనైనా ఆయన వడ్డీరేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రెపోరేటు 6.5, CRR 4.5 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో దేశ GDP భారీగా పడిపోవడానికి వీటిని తగ్గించకపోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. మరి దాస్ నేడేం చేస్తారో చూడాలి.