News May 13, 2024

Elections: IAF మాజీ చీఫ్‌ ఫ్యామిలీకి ఊహించని పరిణామం

image

పుణెలో ఓటు వేసేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఓటర్ లిస్టులో తన భార్య పేరు లేదని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్పులున్నా కూడా లిస్టులో పేరు లేకపోవడానికి గల కారణాలను గుర్తించాలని ఆయన అన్నారు. ఓటర్ల పేర్లు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News March 3, 2026

వ్రతం తర్వాత నాన్ వెజ్ ఏంటని చర్చ!

image

నిన్న విజయ్-రష్మిక దంపతులు గృహప్రవేశం తర్వాత సత్యనారాయణ వ్రతం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం <<19280467>>విందు<<>>లో గ్రామస్థులకు మాంసాహార వంటకాలు వడ్డించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. వ్రతం చేసుకుని నాన్ వెజ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గృహప్రవేశం తర్వాత నాన్ వెజ్ వడ్డిస్తారని, మాంసాహారం గ్రామస్థులకు వడ్డిస్తే ఇబ్బంది ఏంటని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ COMMENT?

News March 3, 2026

కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

image

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్‌కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 3, 2026

జగన్‌ను కలిసిన భట్టి

image

AP: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తన కుమారుడి వివాహ ఆహ్వానపత్రికను అందజేసి, వేడుకకు రావాలని కోరారు. జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, వధూవరులు నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా హత్తుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా భట్టి దివంగత వైఎస్సార్‌ను ఎంతగానో అభిమానిస్తారు.