News March 22, 2024

ELECTORAL BONDS: BRSకు ‘కిటెక్స్’ విరాళం

image

ఎలక్టోరల్ బాండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ ‘కిటెక్స్’ రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు విరాళం ఇవ్వడం గమనార్హం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని ప్రభుత్వం కిటెక్స్‌కు కేటాయించింది.

Similar News

News October 2, 2024

ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..

image

ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.

News October 2, 2024

మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు

image

తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.

News October 2, 2024

రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్

image

టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.