News March 4, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని మండలి ప్రశ్నోత్తరాల్లో YCP సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచబోదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు పాపం జగన్‌దేనని విమర్శించారు. ఐదేళ్లలో 9సార్లు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News February 2, 2026
పిండి దీపం వెలిగిస్తూ పఠించాల్సిన మంత్రాలు

పిండి దీపం వెలిగించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ‘గోవింద నామాలు’ కూడా పలకొచ్చు. ‘శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామావళి’ పఠించడం మరింత శ్రేష్టం. వీలైతే ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ చదువుకోవడం ఉత్తమం. ఈ మంత్రోచ్ఛారణ స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. భక్తితో చేసే ఈ నామ స్మరణ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగి, మానసిక ధైర్యం కలుగుతుంది.
News February 2, 2026
యూరియాకు గుళికలు కలిపి వాడుతున్నారా?

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.
News February 2, 2026
భారత షట్లర్ దేవికా సిహాగ్ అద్భుత విజయం

భారత యువ షట్లర్ దేవికా సిహాగ్ సంచలన విజయం నమోదు చేశారు. హరియాణాకు చెందిన ఈ 20 ఏళ్ల ప్లేయర్ BWF ‘థాయ్‌లాండ్ మాస్టర్స్ 300’ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఫైనల్లో 21-8, 6-3తో మలేషియా షట్లర్ గోజిన్ వీపై దేవికా గెలిచారు. దీంతో తన కెరీర్‌లో తొలిసారి BWF 300 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్‌గా దేవికా నిలిచారు.


