News March 4, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని మండలి ప్రశ్నోత్తరాల్లో YCP సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచబోదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు పాపం జగన్‌దేనని విమర్శించారు. ఐదేళ్లలో 9సార్లు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News March 16, 2025
మీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు

AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి’ అని ట్వీట్ చేశారు.
News March 16, 2025
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇటీవల శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News March 16, 2025
విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.