News August 10, 2024
ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన!

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశముందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. RTCలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
దేశంపై నమ్మకం ఉంచండి: పీయూష్ గోయల్

భారత్తో ట్రేడ్ డీల్ ఆలస్యం కావడానికి మోదీ ఫోన్ <<18809902>>చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. దేశంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు. ‘మీ దేశాన్ని, మాతృభూమిని విశ్వసించండి. విదేశీయుల ప్రకటనలను కాదు. ట్రేడ్ డీల్ చిక్కుల గురించి మీడియా ముందు మాట్లాడుకోరు. రహస్యంగానే చర్చిస్తారు’ అని ఆయన స్పష్టం చేశారు.
News January 11, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
News January 11, 2026
గోదావరి వృథా జలాలు వాడుకుంటే తప్పేంటి: మంత్రి నిమ్మల

AP: ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3000 TMCల గోదావరి నీటిలో 200 TMCలను వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహ హస్తం అందిస్తుంటే, వారు APకి అన్యాయం జరిగేలా కోర్టుకి వెళ్లడం విచారకరమన్నారు. నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు SCలో విచారణ నేపథ్యంలో అధికారులు, లాయర్లతో VC నిర్వహించారు. రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు.


