News September 3, 2024

ఎల్లుండి మరో అల్పపీడనం!

image

ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 6వ తేదీన అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 6, 7 తేదీల్లో ప.గో, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. TGలోనూ రాబోయే 5రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంపై నేడు మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Similar News

News February 2, 2025

కులగణన సర్వే వివరాలు

image

TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం

News February 2, 2025

ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్రంలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ఈ నెల 4న నివేదికపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనూ డిస్కస్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంత ప్రత్యేకమేమీ కాదు: గంభీర్

image

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో పాక్‌తో తాము ఆడే మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ‘23న పాక్‌తో మ్యాచ్ ఉంది అని పనిగట్టుకుని గుర్తుపెట్టుకుని టోర్నీలో అడుగుపెట్టం. లీగ్ దశలో 5 మ్యాచులున్నాయి. అన్నీ మాకు కీలకమే. పాక్‌తో మ్యాచ్ కూడా వాటిలాగే. దాని ప్రత్యేకతేమీ లేదు. ప్రేక్షకులకు భావోద్వేగాలుంటాయి’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.