News December 2, 2024

ఎల్లుండి బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం

image

మ‌హారాష్ట్ర బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం బుధ‌వారం జ‌ర‌గ‌నుంది. MLAలు ముంబైలో ఉండాలని పార్టీ ఆదేశించింది. CMగా దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ పేరును అధిష్ఠానం దాదాపుగా ఖ‌రారు చేసింది. LP మీటింగ్‌లో అధికారికంగా ఆయ‌న పేరును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు ప్ర‌భుత్వ ఏర్పాటు వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు నిర్మ‌లా సీతారామ‌న్‌, విజ‌య్ రూపానీల‌ను బీజేపీ అధిష్ఠానం కేంద్ర ప‌రిశీల‌కులుగా నియ‌మించింది.

Similar News

News January 16, 2025

నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలువురితో ఒప్పందాలు చేసుకోనున్నారు.

News January 16, 2025

3 రోజులు జాగ్రత్త

image

TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

News January 16, 2025

విషాదం.. ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3,200 మందికిపైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక-2024 పేర్కొంది. అత్యధికంగా 1,374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరదల వల్ల 1,287 మంది, వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతో బిహార్‌లో మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నిలిచింది.