News December 1, 2024
ఎల్లుండి క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 4న జరగాల్సిన క్యాబినెట్ భేటీని 3వ తేదీకి మారుస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. ఇవాళ సాయంత్రంలోగా ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖలను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, అదానీ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, పథకాల అమలు తీరుపై చర్చిస్తారని సమాచారం.
Similar News
News February 13, 2025
రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.
News February 13, 2025
అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?

అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారితో కూడిన రెండో విమానం ఈ నెల 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న 104మంది వలసదారుల్ని US అమృత్‌సర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 487మంది అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని విమానాల్ని తమ వద్ద దించుతోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు?

రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం <<15452930>>రాష్ట్రపతి పాలన<<>> విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356(4) ప్రకారం 6నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్ఠంగా 3ఏళ్లు విధించొచ్చు.