News June 22, 2024
ఎల్లుండి కేబినెట్ భేటీ.. రాజధాని, పోలవరంపై కీలక చర్చ!
AP: ఈ నెల 24న (ఎల్లుండి) తొలిసారిగా మంత్రివర్గం సమావేశం కానుంది. ఉ.10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరంపై కీలక చర్చ జరగనుంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశాన్ని మంత్రివర్గంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
Similar News
News November 4, 2024
ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది: మరాఠా కోటా యాక్టివిస్ట్
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయడం లేదని మరాఠా కోటా యాక్టివిస్ట్ మనోజ్ పాటిల్ అన్నారు. 10-15 మంది అభ్యర్థులకు మద్దతిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ‘ఒకే కులం బలంతోనే గెలవలేం. పైగా రాజకీయాలకు మేం కొత్త. ఒకవేళ మేం పోటీచేసి ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది’ అని తెలిపారు. ఆయన నిర్ణయంతో శివసేన UBT, కాంగ్రెస్, పవార్ NCPకి లబ్ధి కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
News November 4, 2024
APPSC ఛైర్మన్‌కు MLC చిరంజీవి వినతులు
AP: నిరుద్యోగులకు చెందిన పలు అభ్యర్థనలను APPSC దృష్టికి MLC వేపాడ చిరంజీవి తీసుకెళ్లారు. ‘గ్రూప్-2 మెయిన్స్ కోసం 90 రోజుల గడువు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 1:100 నిష్పత్తిలో ఎంపిక, Dy.EO,JL,DL నోటిఫికేషన్లు, UPSC మాదిరిగా జాబ్ క్యాలెండర్ అమలు, AEE ఖాళీల భర్తీ, 2018 గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన విధానంపై విచారణ’ వంటి అంశాలను తాను APPSC ఛైర్మన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
News November 4, 2024
కేంద్రంలోకి CBN.. లోకేశ్‌ను సీఎం చేసే ప్రయత్నమా?: ఎంపీ VSR
AP: జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో TDP నిమగ్నమైందా? అని MP విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘అవినీతి సొమ్ము పంచుకోవడంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలతో 5 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను CM చేసే ప్రయత్నంలో ఉన్నారా? చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?’ అని Xలో రాసుకొచ్చారు.