News March 28, 2024

ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరుతున్నాం: HYD మేయర్

image

TG: ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈమేరకు ఆమె ప్రకటన చేశారు. ఎల్లుండి(30న) తామిద్దరం హస్తం పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యల పరిష్కారం సులువు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

Similar News

News January 23, 2025

ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటున్నారా?

image

మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు అంటున్నారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేవరకు వెయిట్ చేయకూడదు. 80 శాతానికి చేరుకోగానే అన్‌ప్లగ్ చేయాలి. అలాగే రాత్రి పూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకూడదు. ఫుల్ ఛార్జ్ అయ్యేదాకా లేదా ఎక్కువ గంటలు ప్లగ్ ఇన్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. ఇంకా ఛార్జింగ్ ఎప్పుడూ జీరోకు రాకుండా చూడాలి. 20% కంటే తగ్గకముందే ఫోన్ ఛార్జ్ చేయడం ఉత్తమం.

News January 22, 2025

రేషన్ కార్డుల అంశంపై ప్రభుత్వం అప్రమత్తం

image

TG: రేషన్ కార్డుల జారీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. గ్రామ సభల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవ చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.

News January 22, 2025

అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే ఫిఫ్టీ

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (50*) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆయన అర్ధ శతకం చేశారు. ఆదిల్ రషీద్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 93/2గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి ఇంకా 40 పరుగులు కావాల్సి ఉంది.