News September 21, 2024
ఎల్లుండి అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, ఇవాళ మరో ఆవర్తనం ఏర్పడనుందని IMD వెల్లడించింది. ఇది వాయవ్య దిశగా కదలి ఎల్లుండి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు విస్తారంగా వానలు కురుస్తాయంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. మరోవైపు ఈవారంలోనే దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు.
Similar News
News December 21, 2024
నా సహచరులు విధిలేక బీఆర్ఎస్లో ఉన్నారు: సీఎం రేవంత్
కొంతమంది నేతలు విధిలేక BRSలో కొనసాగుతున్నారని CM రేవంత్ అన్నారు. ‘BRSలోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. BRS వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.
News December 21, 2024
విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు
బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో ఫ్లోర్లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.
News December 21, 2024
సినీ స్టార్లపై సీఎం రేవంత్ ఫైర్
TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్‌కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.