News September 30, 2024
ఎల్లుండి రజినీ ‘వేట్టయన్’ ట్రైలర్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ట్రైలర్ అక్టోబర్ 2న రానుంది. లైకా ప్రొడక్షన్స్ తాజాగా ఇందుకు సంబంధించిన ట్రైలర్ రివీల్ పోస్టర్‌ను విడుదల చేసింది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించారు. మంజూ వారియర్ హీరోయిన్‌గా అలరించనున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
Similar News
News October 16, 2024
అద్భుతం: కలలోనూ సమాచార మార్పిడి!
కలగంటున్న ఇద్దరు వ్యక్తులకు సమాచారాన్ని పంపడంలో కాలిఫోర్నియా సైంటిస్టులు విజయం సాధించారు. ‘డెయిలీ మెయిల్’ కథనం ప్రకారం.. నిద్రపోవడానికి ముందు ఇద్దరు అభ్యర్థులకు బ్రెయిన్‌ను పర్యవేక్షించే పరికరాల్ని పరిశోధకులు అమర్చారు. యంత్రం ద్వారా ఓ పదాన్ని వారికి పంపించగా, నిద్రలోనే పైకి పలికారని వివరించారు. ఇది మానసిక అనారోగ్యాల చికిత్సలో మున్ముందు కీలకంగా మారొచ్చని సైంటిస్టులు పేర్కొన్నారు.
News October 16, 2024
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోని భక్తులు కూడా అయ్యప్పను దర్శనం చేసుకోవచ్చని పినరయి విజయన్ సర్కార్ ప్రకటించింది. వర్చువల్ బుకింగ్‌పై విపక్షాలు, భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో విజయన్ దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వచ్చిన వారికి కూడా దర్శన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News October 16, 2024
కమిన్స్‌ను SRH వదిలేస్తుంది: ఆకాశ్ చోప్రా
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోదని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పారు. అతడిపై రూ.18 కోట్లు వెచ్చించేందుకు ఆ జట్టు సిద్ధంగా లేదని చెప్పారు. ‘కమిన్స్‌తోపాటు మార్క్‌రమ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్‌ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం కచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.