News June 19, 2024
ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ!

TG: ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News September 15, 2025
ఆ పూలు పూజకు పనికిరావు!

పువ్వుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు. ‘కింద పడిన, వాసన చూసిన, ఎడమ చేతితో కోసిన పువ్వులను పూజకు వాడరాదు. ఎడమ చేత్తో, ధరించిన వస్త్రాలలో, జిల్లేడు/ఆముదం ఆకులలో తీసుకొచ్చిన పువ్వులను కూడా ఊపయోగించకూడదు’ అని చెబుతున్నారు. పూజలో పువ్వులను సమర్పించేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలు మాత్రమే వాడాలి’ అని అంటున్నారు.
News September 15, 2025
కార్తెలు అంటే ఏంటి?

జ్యోతిషులు ఉపయోగించే నక్షత్రాల ఆధారంగా.. రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం రూపొందించుకున్న కాలాన్ని ‘కార్తెలు’ అని అంటారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని ఆ నక్షత్రం పేరుతో పిలుస్తారు. అలా మృగశిర కార్తె, చిత్త కార్తె, రోహిణి కార్తె.. వంటివి వస్తాయి. ఈ కార్తెలు సుమారుగా 13-14 రోజులు ఉంటాయి. వీటిని ఉపయోగించి రైతులు వాతావరణ మార్పులను అంచనా వేస్తారు. వ్యవసాయ పనులు చేసుకుంటారు.
News September 15, 2025
పూజ గది శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పండితుల సూచనల మేరకు.. పూజ గదిని శనివారం శుభ్రం చేయడం ద్వారా అనుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది వీలు కాకపోతే ఏకాదశి (లేదా) గురువారం రోజున శుభ్రం చేసుకోవచ్చు. శుభ్రం చేశాక పూజ గదిలో గంగాజలం చల్లడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీపాలను కూడా నీటితో శుభ్రం చేయాలి. దేవుళ్ల విగ్రహాలు, చిత్రపటాలను నేలపై పెట్టకూడదు. తెల్లటి, శుభ్రమైన గుడ్డపై ఉంచాలి. ఈ నియమాలతో శుభాలు కలుగుతాయి.