News November 2, 2024

ఎల్లుండి టెట్ ఫలితాలు.. 6న డీఎస్సీ నోటిఫికేషన్

image

AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగిన టెట్ ఫలితాలను ఎల్లుండి మంత్రి లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ రిజల్ట్స్ రాగానే ఈ నెల 6వ తేదీన 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనుంది.

Similar News

News December 13, 2024

భార్యాబాధితుడి సూసైడ్: భార్య ఆఫీస్ ముందు మగాళ్ల ఆందోళన

image

భార్యాబాధితుడు అతుల్ <<14841616>>సూసైడ్<<>> నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది! ‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’ అంటూ మగవాళ్లు నినదిస్తున్నారు. బెంగళూరులో అతడి భార్య నికిత పనిచేసే అసెంచర్ ఆఫీస్ ముందు వందలాది IT ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా అసెంచర్ ఆఫీసులు, ఢిల్లీ జంతర్ మంతర్‌ వద్దకు టెకీలు రావాలని పిలుపునిస్తూ అక్కడక్కడా పోస్టర్లు వెలిశాయి. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్లు పెరిగాయి.

News December 13, 2024

ఈ నెల 16న క్యాబినెట్ భేటీ

image

TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.

News December 13, 2024

నేటి ‘గూగుల్’ డూడుల్ గమనించారా?

image

దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.