News March 18, 2024
ఏలూరు: కన్నకూతురిపై తండ్రి అత్యాచారయత్నం
కూతురిపై తండ్రి అత్యాచారయత్నం చేసిన ఘటన ఆగిరిపల్లి మండలంలో జరిగింది. SI సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొమ్మూరుకు చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో 7వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో సదరు వ్యక్తిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు SI తెలిపారు.
Similar News
News October 16, 2024
కొవ్వూరులో షేర్ యాప్ పేరిట భారీ మోసం
కొవ్వూరు టౌన్‌కు చెందిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ శ్రీనివాస్ షేర్ యాప్ ద్వారా రూ.29.30 లక్షలు పోగొట్టుకున్నాడని టౌన్ సీఐ విశ్వం మంగళవారం తెలిపారు. శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్‌లో మోతిలాల్ అశ్వాల్ ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అనే షేర్ మార్కెట్ యాప్ ద్వారా 4 బ్యాంకు ఖాతాలకు రూ.29.30 లక్షలను చెల్లించారన్నారు. తన షేర్స్ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా జమ కాలేదన్నారు. కేసు నమోదు చేశామన్నారు.
News October 16, 2024
గోపాలపురం: బైకు కొని కన్నవారికి చూపించాలని వెళ్తూ మృతి
గోపాలపురం శివారు జాతీయ రహదారిపై మంగళవారం లారీ ఢీకొని బొర్రంపాలెం గ్రామానికి చెందిన గణేశ్ కుమార్ (42) <<14363209>>మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం.. అతను కొత్త బైకు కొని, తల్లిదండ్రులకు చూపించేందుకు వెళ్తుండగా లారీ ఢీ కొని కొంతదూరం లాక్కెల్లింది. ప్రమాదంలో గాయపడిన అతడిని రాజమండ్రికి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సతీశ్ కుమార్ తెలిపారు.
News October 16, 2024
బీజేపీ ఏలూరు నేత డిమాండ్‌పై మీ కామెంట్..?
ప్రతి బ్రాందీ షాపు, బార్ వద్ద మద్యం తాగేవారికి ఉచిత డ్రాపింగ్ వ్యాన్స్ ఏర్పాటు చేయాలని BJP కిసాన్ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షుడు కీర్తి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ వెట్రి సెల్వికి వినతిపత్రం అందించారు. ఆరోగ్యానికి హానికరమైనా మద్యపాన నిషేధం ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. డ్రాపింగ్ వ్యాన్స్ ఏర్పాటుతో కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ డిమాండ్‌పై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.