News July 12, 2024

ఎమర్జెన్సీ.. ఆనాడు ఏం జరిగింది?

image

అంతర్గత కల్లోలం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందంటూ 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఒత్తిడితో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ <<13615795>>ఎమర్జెన్సీకి<<>> ఆమోద ముద్ర వేశారు. ఎమర్జెన్సీ విషయాన్ని ఇందిరా రేడియోలో ప్రకటించారు. దీంతో దేశపౌరులు అణచివేతకు గురయ్యారు. సుమారు 1.50లక్షల మంది జైలుపాలయ్యారు. పత్రికాస్వేచ్ఛ మంటగలిసింది. అధికారం నుంచి దిగక తప్పదనే ఇందిర ఎమర్జెన్సీ విధించారని విమర్శలొచ్చాయి.

Similar News

News February 18, 2025

నేడు కుంభమేళాకు పవన్ కళ్యాణ్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ యూపీలోని ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. నిన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు కూడా కుంభమేళాకు వెళ్లిన విషయం తెలిసిందే.

News February 18, 2025

పార్టీ ఫిరాయింపుల కేసు.. నేడు సుప్రీంలో విచారణ

image

TG: తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లోకి మారిన 10మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్‌ పార్టీ గత నెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించనుంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌పై స్పెషల్ లీవ్ పిటిషన్, మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్‌ను బీఆర్ఎస్ దాఖలు చేసింది.

News February 18, 2025

సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

image

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్‌లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)

error: Content is protected !!