News August 19, 2024

నేటి నుంచి ఉద్యోగుల బదిలీలు

image

AP: 15 శాఖల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ఉద్యోగులందరికీ ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరిలో అధికశాతం మంది బదిలీలపై విముఖంగా ఉన్నారు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం.

Similar News

News September 9, 2024

నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్

image

రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్‌ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.

News September 9, 2024

సెప్టెంబర్ 09: చరిత్రలో ఈరోజు

image

1914: కవి కాళోజీ నారాయణరావు జననం
1935: నటుడు, కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1953: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1987: బాల మేధావి తథాగత్ అవతార్ తులసి జననం
తెలంగాణ భాషా దినోత్సవం

News September 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.