News February 1, 2025

నిర్మల బడ్జెట్‌పై ఉద్యోగుల ప్రశంసలు

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. రూ.12 లక్షల వరకూ జీరో ట్యాక్స్ ఉంటుందని చెప్పడంతో చిరు, మధ్యతరహా ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల్లో 75శాతం కంటే ఎక్కువ మంది రూ.12 లక్షల కంటే తక్కువ జీతాలు పొందేవారే ఉన్నారని, ఇది ఉపశమనం కలిగించే విషయం అని కొనియాడుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Similar News

News February 17, 2025

పండ్ల మార్కెట్లో అగ్నిప్రమాదం

image

AP: రాజమండ్రి దివాన్‌చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లోని కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి. వ్యాపారులు వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

News February 17, 2025

ప్రార్థనా స్థలాల చట్టం కేసు: సుప్రీంకోర్టు అసంతృప్తి

image

ప్రార్థనా స్థలాల చట్టం కేసుపై కుప్పలు తెప్పలుగా కొత్త పిటిషన్లు రావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ముగ్గురు సభ్యుల బెంచ్ వాదనలు వినడంతో ఇద్దరితో కూడిన తమ బెంచ్ పెండింగ్ పిటిషన్లను తీసుకోబోదని CJI సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ‘పిటిషన్లు వేయడానికీ ఓ పరిమితి ఉంటుంది. తాజాగా మరిన్ని వచ్చాయి. వాటిని మేం స్వీకరించలేం. మార్చిలో కొత్త తేదీ ఇస్తాం’ అని తెలిపారు.

News February 17, 2025

కాంగ్రెస్‌‌పై విపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: జనాభా ప్రకారం BCలకు రిజర్వేషన్లు కల్పించాలని కులగణన చేపట్టినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లిలో పట్టభద్రుల MLC అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ఆయన మాట్లాడారు. BC రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!