News March 28, 2024
లాభాలతో ఆర్థిక ఏడాదిని ముగించాయి!

FY24 ఆర్థిక ఏడాది చివరి వర్కింగ్ డేను దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1100 పాయింట్లు తాకి 74,105కు చేరగా, నిఫ్టీ 350 పాయింట్లు లాభపడి 22,500 మార్క్ టచ్ చేసింది. అయితే ఒడుదొడుకుల కారణంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 73,651 వద్ద.. నిఫ్టీ 219 పాయింట్లు పెరిగి 22,343 వద్ద స్థిరపడ్డాయి. గుడ్ ఫ్రైడే కావడంతో రేపు మార్కెట్లకు సెలవు ఉండనుంది.
Similar News
News February 9, 2026
జగిత్యాల: ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల ప్రారంభం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్‌తో కలిసి గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేవైసీ నవీకరణ సురక్షిత బ్యాంకింగ్‌కు తొలి అడుగని తెలిపారు. కేవైసీ వివరాలు నవీకరించుకోవడం ద్వారా ఖాతాల దుర్వినియోగాన్ని నివారించవచ్చని అన్నారు.
News February 9, 2026
చెవులు లేకున్నా వింటాయివి!

ప్రత్యేక శరీర ఆకృతి, కండరాల నిర్మాణంతో కొన్ని జీవులు బాహ్య చెవులు లేకున్నా వినగలుగుతాయి. పాములకు దవడ ఎముక ద్వారా లోపలి చెవికి సౌండ్ సిగ్నల్స్ అందుతాయి. సాలీడు కాళ్లపై ఉన్న వెంట్రుకలు వైబ్రేషన్స్ విని అపాయాన్ని పసిగడతాయి. సాలమండర్లు చర్మం, వాటి పుర్రె ఎముకలు.. బల్లుల అంతర్గత శరీరాకృతి వల్ల వినగలుగుతాయి. చాలా రకాల చేపలు సైతం అవి తిరిగే ప్రాంతంలో ప్రత్యేకమైన సిస్టమ్ ఏర్పరచుకొని సౌండ్స్ వింటాయి.
News February 9, 2026
దక్షిణ దిశలో ఇల్లు ఉండకూడదా?

దక్షిణానికి యముడు అధిపతి కావడంతో ఈ దిక్కున ఇల్లు కడితే అశుభమని చాలామంది భయపడతారు. అయితే ఇది అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘దక్షిణాన ఉన్న స్థలం నివాసానికి పనికిరాదనేది నిజం కాదు. నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దిక్కున ఉన్నవాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటే యమస్థానం నుంచి కూడా మంచి ఫలితాలను పొందవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


