News May 11, 2024
సెప్టెంబర్ 15లోపు ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు: AICTE

ఇంజినీరింగ్ ఫస్టియర్ తరగతులను సెప్టెంబర్ 15లోపు ప్రారంభించాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) నిర్దేశించింది. వచ్చే విద్యాసంవత్సరానికి (2024-25) సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. జూన్ 30వ తేదీ నాటికి కాలేజీలకు తుది అనుమతులు జారీ చేస్తామని తెలిపింది. జులై 31లోపు ఆయా వర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఆదేశించింది.
Similar News
News April 18, 2026
భీమవరం: పోలీసుల కళ్లుగప్పి మహిళా ఖైదీ పరార్

హైదరాబాద్‌లోని పెట్లబుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన మహిళా ఖైదీని చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఒక సెల్‌ఫోన్, హ్యాండ్ కప్స్ స్వాధీనం చేసుకున్నారు. భీమవరానికి చెందిన త్రివేణి సైబర్ క్రైమ్, చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉండి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈ క్రమంలో గర్భిణీ అని చెప్పగా.. ఆసుపత్రికి తీసుకెళ్లగా పారిపోయింది.
News April 18, 2026
‘హార్ముజ్’ ఓపెన్.. ఇరాన్ 3 షరతులివే!

‘హార్ముజ్’ను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ 3 కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
☛ జలసంధి గుండా కమర్షియల్ నౌకలకే అనుమతి ఉంటుంది. మిలిటరీ నౌకలకు ప్రవేశం లేదు.
☛ ఇరాన్ నిర్దేశించిన మార్గంలోనే షిప్స్ వెళ్లాలి.
☛ ఇరాన్ మిలిటరీతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతే రాకపోకలు జరగాలి.