News November 11, 2024
రెండో T20లోనూ విండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు

వెస్టిండీస్‌తో జరిగిన 2వ టీ20లోనూ ఇంగ్లండ్ గెలిచింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 158/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ జోస్ బట్లర్ 83(45బంతుల్లో 8ఫోర్లు, 6సిక్సులు) పరుగులతో రాణించారు.
Similar News
News April 20, 2026
ఇరాన్‌తో యుద్ధం ముగియలేదు: నెతన్యాహు

ఇరాన్‌తో సాగుతున్న పోరాటం ఇంకా ముగియలేదని, ఏ క్షణమైనా కొత్త పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఇజ్రాయెల్ PM నెతన్యాహు హెచ్చరించారు. ‘రేపు లేదా ఎల్లుండి ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?’ అంటూ పరిస్థితి చాలా ఉత్కంఠభరితంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించి తీరతాయని, ప్రపంచ స్వేచ్ఛా ప్రియులకు ఇది కొత్త ఆశలు చిగురింపజేస్తుందని స్పష్టం చేశారు.

IPL: అదే మా సక్సెస్ మంత్ర: శ్రేయాస్ అయ్యర్

LSGపై విజయం అనంతరం తమ ఆటగాళ్ల గెలుపు మంత్రాన్ని PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ రివీల్ చేశారు. టీమ్ పర్ఫార్మెన్స్‌పై సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానోలీ బాదిన బాదుడుకు ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. ‘వాళ్ల హిట్టింగ్ చూస్తుంటే.. ఫాస్ట్ బౌలర్లనూ బ్యాక్ ఫుట్‌పై స్ట్రైట్ సిక్సర్లు కొట్టడం అమేజింగ్’ అని కొనియాడారు. ప్లేయర్లకు ఫ్రీడమ్ ఇవ్వడమే తమ సక్సెస్ మంత్ర అని తెలిపారు.