News February 9, 2025
ఇంగ్లండ్ భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఓపెనర్ డకెట్(65), రూట్(69) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్, హర్షిత్ తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 50 ఓవర్లలో 305.
Similar News
News March 21, 2025
విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్

కర్ణాటక ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేయనుంది. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి వారికి అవసరమైన నాలెడ్జ్‌ను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు తరగతులు నిర్వహిస్తారు. అలాగే, చిన్న వయసులో లైంగిక కార్యకలాపాల వల్ల దుష్ప్రభావంపై కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
News March 21, 2025
GST: ఏ శ్లాబ్‌రేటులో ఎంత ఆదాయం వస్తుందంటే..

GSTలో 5%, 12%, 18%, 28% శ్లాబ్‌రేట్లు ఉన్నాయి. విలువ, ప్రజలపై పన్ను భారాన్ని బట్టి వస్తు, సేవలను ఆయా శ్లాబుల్లో నమోదు చేశారు. 5% శ్లాబ్‌రేటు ద్వారా ప్రభుత్వానికి 8% ఆదాయం వస్తుంది. 12% శ్లాబ్ నుంచి అతి తక్కువగా 5%, పెద్ద శ్లాబ్ 28% ద్వారా 12.5% రాబడి వస్తుంది. కీలకమైన 18% శ్లాబ్ రేటు ద్వారా ఏకంగా 73% పన్ను ఆదాయం లభిస్తుంది. కొన్ని వస్తువులపై ఎలాంటి పన్నూ లేకపోవడం గమనార్హం.
News March 21, 2025
రాజ్యసభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

పశుపతినాథ్(నేపాల్) నుంచి తిరుపతి వరకూ విస్తరించిన రెడ్ కారిడార్‌ను నిర్మూలించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. ‘నక్సలిజం అనేది రాజకీయ సమస్య కాదు. మావోయిస్టుల నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేశాం. మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఇప్పుడు 12 మాత్రమే ఉన్నాయి. మన CRPF, కోబ్రా బలగాల పనితీరు అద్భుతంగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల ఏరివేత పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు.