News October 9, 2024
ENGvsPAK: రూట్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ పాక్‌పై సెంచరీతో చెలరేగారు. ముల్తాన్‌లో జరుగుతోన్న టెస్టు మ్యాచులో ఆయన తన 35వ టెస్టు సెంచరీని పూర్తిచేసుకున్నారు. దీంతో అన్ని ఫార్మాట్లలో రూట్ 51 సెంచరీలు పూర్తిచేసుకున్నారు. అలాగే అత్యధిక సెంచరీలు చేసిన రెండో యాక్టివ్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 80 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (48), కేన్ (45), స్మిత్ (44) ఉన్నారు.
Similar News
News November 4, 2024
బీటెక్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలదే అధిక వాటా!
ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీ కంటే బీటెక్ చదివేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 3,08,686 సీట్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532 & తెలంగాణలో 1,45,557 సీట్లున్నాయి. ఇలా చూస్తే దేశంలోని ఇంజినీరింగ్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలే 40శాతం వాటా కలిగి ఉన్నాయి.
News November 4, 2024
BREAKING: టెట్ ఫలితాలు విడుదల
AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <
News November 4, 2024
రేపు రాష్ట్రానికి రాహుల్ గాంధీ
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, విద్యావేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ సమావేశానికి దాదాపు 400 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం.