News May 12, 2024
‘ఎన్ని’కల కష్టాలో

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓటు వేసేందుకు కుటుంబాలతో వెళ్తున్న వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు రద్దీకి తగ్గట్లు బస్సులు లేక నిరీక్షించి నిరసించిపోతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTCలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
Similar News
News March 7, 2026
సెంటిమెంట్.. హోటల్‌ను మార్చిన టీమ్ఇండియా

T20 WC విజేతగా నిలిచేందుకు టీమ్ఇండియా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకొని, సెంటిమెంట్ పరంగా ఆ టైమ్‌లో బస చేసిన ITC నర్మదలో కాకుండా తాజ్ స్కై లైన్‌కు బస మార్చేసింది. అహ్మదాబాద్‌లో రేపు న్యూజిలాండ్‌తో ఫైనల్ జరగనుండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇటీవల చంద్రగ్రహణం టైమ్‌లోనూ జట్టు ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.
News March 7, 2026
సర్కారు బడి పిల్లలకు గుడ్ న్యూస్.. వారానికో రోజు ఫిష్!

TG: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న చికెన్ స్థానంలో వారానికి ఒకరోజు చేపలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కొత్త మెనూ అమలు చేసే అవకాశం ఉంది. ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించేలా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
News March 7, 2026
గుడ్‌న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

AP: జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.


