News March 10, 2025
పుష్ప-2 లాభాలను దానికోసం వాడేలా చూడండి: హైకోర్టులో పిల్

TG: పుష్ప-2 సినిమాకు వచ్చిన లాభాలను చిన్న బడ్జెట్ సినిమాల రాయితీకి ఉపయోగించాలని నరసింహారావు అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం లాభాలను కళాకారుల సంక్షేమానికి వాడాలని అందులో కోరారు. కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబరులో విడుదలైన పుష్ప-2 అన్ని భాషల్లో కలిసి రూ.1800 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.
Similar News
News March 21, 2025
రెండేళ్ల తర్వాత రూపాయికి బెస్ట్ వీక్ ఇదే

భారత రూపాయి అదరగొట్టింది. డాలర్‌తో పోలిస్తే ఈ రెండేళ్లలో ఈ వారమే అత్యధికంగా ఎగిసింది. 1.2 శాతానికి పైగా బలపడింది. నేడు ఏకంగా 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ పతనమవ్వడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి RBI మద్దతివ్వడం, ఫారిన్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటం, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం, మొత్తం సర్‌ప్లస్ $4.5 బిలియన్లకు చేరడమే ఇందుకు కారణాలు.
News March 21, 2025
సీఎంతో హరీశ్, పద్మారావు భేటీ

TG: అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పద్మారావు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని సీఎంకు వారు ఫిర్యాదు చేశారు.
News March 21, 2025
నటి రజిత ఇంట్లో విషాదం

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి(76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు. రజిత 1986 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.