News June 29, 2024
TTD సేవలకు ఆధార్ లింక్‌పై పరిశీలించాలన్న ఈవో
AP: తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌లను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పటికీ దళారుల బెడద తప్పడం లేదని ఈవో శ్యామలరావు చెప్పారు. వారిని నియంత్రించడానికి టీటీడీ సేవలకు ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌తో భక్తుల గుర్తింపు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి? ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలనే అంశాలపై ఆయన ఇవాళ చర్చించారు.
Similar News
News December 5, 2024
పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం
క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.
News December 5, 2024
చైనాతో చేతులు కలిపిన నేపాల్
చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI)లో భారత పొరుగు దేశం నేపాల్ చేరింది. ఎన్నికల ఫలితాల అనంతరం నేపాల్ ప్రధాని న్యూఢిల్లీకి వచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి పీఎం కేపీ ఓలి శర్మ తాజాగా బీజింగ్ వెళ్లారు. సోమవారం నుంచీ అక్కడే ఉంటూ బీఆర్ఐలో చేరే ప్రక్రియపై చర్చలు జరిపారు. తాజాగా ఆ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు నేపాల్ విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.
News December 5, 2024
ప్రపంచంలోనే మోదీ తెలివైనోడు: కువైట్ మంత్రి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తెలివైనవారిలో ఒకరని కువైట్ విదేశాంగ మంత్రి అలీ అల్ యాహ్యా ప్రశంసించారు. తమకు ఎంతో విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ‘నన్ను భారత్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మోదీ ఈ దేశాన్ని ఒక మంచి దశలో ఉంచుతారు. భారత్‌తో మా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల సంబంధాలను బలపరిచేందుకు యాహ్యా ఇక్కడికి వచ్చారు.