News December 2, 2024
నకిలీ బెయిల్ పత్రాలతో జైలు నుంచి పరార్..!

TG: చంచల్గూడ జైలు నుంచి ఓ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలతో విడుదలయ్యాడు. భూకబ్జా ఆరోపణలపై సుజాతలి ఖాన్(27)ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో అతడు ఫేక్ బెయిల్ పత్రాలను జైలు అధికారులకు ఇచ్చి గత నెల 26న బయటకు వచ్చాడు. కానీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఆన్లైన్లో లేకపోవడంతో అవి నకిలీవని గుర్తించి కంగుతిన్నారు. ఇప్పుడా ఖైదీ కోసం జైలు అధికారులు వెతికే పనిలో పడ్డారు.
Similar News
News January 20, 2026
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News January 20, 2026
తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

భారత్లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్లో సన్రూఫ్, వైర్లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.
News January 20, 2026
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం: CBN

AP: టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోని మార్పులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తామని CBN పేర్కొన్నారు. ‘దావోస్ సదస్సులో ప్రముఖుల ఆలోచనలతో రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తాం. అగ్రి, మెడికల్ రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తాం. 2026లో డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. 50L ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని దావోస్లో CII బ్రేక్ ఫాస్ట్ సెషన్లో CM పేర్కొన్నారు.


