News April 25, 2024
ఎల్లలు లేని మానవత్వం.. పాక్ యువతికి భారతీయుడి గుండె

మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపితమైంది. గుండె వ్యాధితో బాధపడుతోన్న పాకిస్థాన్‌కు చెందిన ఆయేషా రశన్(19) అనే యువతికి చెన్నైలోని ఆస్పత్రిలో ఓ స్వచ్ఛంద సంస్థ చికిత్స అందించింది. ఇటీవల చనిపోయిన ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చింది. రూ.35 లక్షలకు పైగా ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఫ్రీగా చేసింది. తమ కూతురికి జీవితాన్నిచ్చిన ట్రస్టు, వైద్యులకు ఆమె తల్లి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 1, 2026
NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మధ్యప్రదేశ్ సెహోర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<
News February 1, 2026
‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.
News February 1, 2026
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన రిషబ్ శెట్టి

కాంతార సినిమాలతో పాపులర్ అయిన రిషబ్ శెట్టి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు రూ.80కోట్లు అడుగుతున్నట్టు చర్చ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందే పీరియాడిక్ డ్రామాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


