News September 2, 2024
ఇథనాల్ బ్లెండింగ్‌తో రూ.లక్ష కోట్లు ఆదా
ఇథనాల్ బ్లెండింగ్ వల్ల 2014 నుంచి రూ.99,014 కోట్ల విదేశీమారక ద్రవ్యం ఆదా చేసినట్టు పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. 17.3 MMT క్రూడాయిల్‌కు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడిందన్నారు. ఈ పదేళ్లలో 51.9 MMT మేర కర్బన ఉద్గారాలు తగ్గాయని పేర్కొన్నారు. OMCలు డిస్టిలరీలకు రూ.1.45 లక్షల కోట్లు, రైతులకు రూ.87,558 కోట్లు చెల్లించాయన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌లో 15% ఇథనాల్ కలుపుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News September 20, 2024
CM గారూ.. మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం: మహీంద్రా
TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో CM రేవంత్‌ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ‘ఆ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడాన్ని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్.. మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్నదానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు’ అని పేర్కొన్నారు.
News September 20, 2024
మరో ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్‌బై?
AP: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు పార్టీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే బాలినేని, ఉదయభాను వంటి నేతలు వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావుతో పాటు పలువురు నేతలు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
News September 20, 2024
బరువు తగ్గేందుకు ఓకేగానీ ఆ డైట్‌తో గుండె, పొట్టకు ప్రమాదం!
బరువు తగ్గేందుకు సాయపడే కీటోడైట్ గుండె, పొట్టకు అంత మంచిది కాదని సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిషైన కొత్తస్టడీ పేర్కొంది. దానికన్నా లోషుగర్ డైట్ బెటరంది. ‘కీటో వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా నాశనమవుతోంది. మైక్రోబయోమ్ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎక్కువ కొవ్వు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. గుండె జబ్బులకు కారణమయ్యే అపోలిపో ప్రొటీన్ పెరగడాన్ని మూత్రంలో గమనించాం’ అని పేర్కొంది.