News October 31, 2024

నీతి, నిజాయితీగా పనిచేస్తా: టీటీడీ ఛైర్మన్

image

AP: గత ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు సృష్టించిందని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. తాను నీతి, నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. ‘గతంలో రెగ్యులర్‌గా తిరుమల వెళ్లేవాడిని. కానీ గత ఐదేళ్లుగా ఒక్కసారి కూడా వెళ్లలేదు. తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ దెబ్బతీయడంతోనే నేను కొండకు వెళ్లలేదు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన ఉంది. చంద్రబాబు సలహాలు, సూచనలతో ముందుకెళ్తా’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

image

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.