News October 31, 2024
నీతి, నిజాయితీగా పనిచేస్తా: టీటీడీ ఛైర్మన్
AP: గత ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు సృష్టించిందని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు. తాను నీతి, నిజాయితీతో పనిచేస్తానని చెప్పారు. ‘గతంలో రెగ్యులర్‌గా తిరుమల వెళ్లేవాడిని. కానీ గత ఐదేళ్లుగా ఒక్కసారి కూడా వెళ్లలేదు. తిరుమల ఆలయ పవిత్రతను వైసీపీ దెబ్బతీయడంతోనే నేను కొండకు వెళ్లలేదు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన ఉంది. చంద్రబాబు సలహాలు, సూచనలతో ముందుకెళ్తా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 3, 2024
హెజ్బొల్లాకు మరో షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్
హెజ్బొల్లా కీలక సభ్యుడు జాఫర్ ఖాదర్ ఫార్‌ను దక్షిణ లెబనాన్‌లో మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హెజ్బొల్లాకు చెందిన నాసర్ బ్రిగేడ్ రాకెట్, మిస్సైల్స్ యూనిట్‌కు జాఫర్ టాప్ కమాండర్‌గా ఉన్నట్లు తెలిపింది. గతంలో ఇజ్రాయెల్‌పై జరిగిన మిస్సైల్స్ దాడుల వెనుక ఇతడే ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇటీవల హెజ్బొల్లా చీఫ్‌లుగా పనిచేసిన ఇద్దరిని IDF హతమార్చిన విషయం తెలిసిందే.
News November 3, 2024
జార్ఖండ్‌లో ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఇలా..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. CM హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43, కాంగ్రెస్ 30, RJD 6, వామపక్షాలు 3 చోట్ల పోటీ చేయనున్నాయి. షేరింగ్ ఫార్ములా ప్రకారం ధన్వర్, చత్రాపూర్, విశ్రంపూర్ స్థానాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉండనుంది. మొత్తం 82 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఈనెల 13, 20న రెండు విడతల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.
News November 3, 2024
వదిలేసిన ఆటగాళ్లను మళ్లీ దక్కించుకుంటాం: LSG కోచ్
గత IPL సీజన్‌లో తమ టీమ్ తరఫున ఆడిన ప్లేయర్స్‌లో చాలామందిని మళ్లీ వేలంలో దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని LSG కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపారు. ఎన్నో చర్చలు, జాగ్రత్తల తర్వాతే రిటెన్షన్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అత్యంత ప్రతిభావంతులైన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కాగా పూరన్‌తో పాటు రవి బిష్ణోయ్, మయాంక్, మోసిన్ ఖాన్, బదోనీని LSG అట్టిపెట్టుకుంది.