News November 18, 2024

BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నా: అర్వింద్

image

TG: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని పాతబస్తీ నుంచే మొదలుపెట్టాలని, కాంగ్రెస్ బుల్డోజర్లకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ KTRది మేకపోతు గాంభీర్యమని, ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అని నిలదీశారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం పనే అని ఆరోపించారు.

Similar News

News March 9, 2026

మా దేశ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరం: ఇరాన్ FM

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికలో విదేశీయుల ప్రమేయం అవసరం లేదని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడంలో తాము సాయం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘మా దేశ వ్యవహారాల్లో ఇతరులను జోక్యం చేసుకోనివ్వం. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ లీడర్‌ను నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. కాగా కొత్త నాయకుడిగా మొజ్తాబా ఎన్నికైనట్లు వార్తలొస్తున్నాయి.

News March 9, 2026

గంభీర్.. ఒక్క ఫైనల్‌లోనూ ఓడలేదు

image

గౌతమ్ గంభీర్ ఇప్పటివరకూ ఒక్క ICC ఫైనల్ కూడా ఓడలేదు. భారత ప్లేయర్‌గా 2007 T20 WC, 2011 ODI WC, హెడ్ కోచ్‌గా ఛాంపియన్స్ ట్రోఫీ(2025), టీ20 WC(2026) సాధించారు. ప్లేయర్‌గా 2010 ఆసియా కప్ కూడా గెలిచారు. అలాగే IPLలో KKRకి కెప్టెన్‌గా 2, మెంటార్‌గా ఒక టైటిల్ అందించారు. కోచ్‌గా జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్‌లో తరచూ మార్పులు చేస్తున్నారని ఆయనపై విమర్శలొచ్చాయి. కానీ ఆ మార్పులే ఇప్పుడు విజయాన్ని కట్టబెట్టాయి.

News March 9, 2026

భారత మెన్స్ టీమ్ గెలిచిన ICC WCలు

image

భారత పురుషుల జట్టు ఇప్పటివరకు 5 సార్లు ప్రపంచకప్‌లు సాధించింది. అందులో రెండు వన్డే WCలు, మూడు T20WCలు ఉన్నాయి. 1983లో వన్డే ప్రపంచకప్, 2007లో టీ20 WC, 2011లో వన్డే ప్రపంచకప్, 2024లో టీ20 WC, 2026లో టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల కెప్టెన్సీలో భారత్ ఈ కప్పులు సొంతం చేసుకుంది.