News August 18, 2024
పదేళ్లు అధికారంలో ఉన్నా ఒక్క సీటు రాలే: మంత్రి కోమటిరెడ్డి
TG: ప్రజల్లో లేని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. హరీశ్, కేటీఆర్ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటికే విలీనంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
Similar News
News September 19, 2024
ఆయన డాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్: ఎన్టీఆర్
తమిళ హీరో విజయ్ డాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని ఎన్టీఆర్ అన్నారు. అతి చూపించకుండా ఉండాలని, విజయ్ స్టెప్పులు కూల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయని చెప్పారు. డాన్స్ అనేది ఫైట్, జిమ్నాస్టిక్స్ చేసినట్లుగా ఉండొద్దన్నారు. శ్రమపడనట్లుగా డాన్స్ ఉండాలని విజయ్ అలాగే చేస్తారని కొనియాడారు. అప్పట్లో తామిద్దరం తరచూ మాట్లాడుకునేవాళ్లమన్నారు. కాగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ ఈ నెల 27న విడుదల కానుంది.
News September 19, 2024
విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన
TG: ప్రస్తుతం ఇళ్లకు 200యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ₹10 నుంచి ₹50కి పెంచాలని డిస్కంలు ERCకి ప్రతిపాదించాయి. ఆ కేటగిరీలో 20%లోపే ప్రజలు ఉన్నందున అంతగా ప్రభావం పడదని అంచనా. పరిశ్రమలకు సంబంధించి 11KVకి యూనిట్‌కు ₹7.65, 33KVకి ₹7.15, 132KVకి ₹6.65 వసూలు చేస్తుండగా, ఇకపై అన్ని కేటగిరీలకు ₹7.65చొప్పున వసూలుకు అనుమతించాలని కోరాయి.
News September 19, 2024
లంచ్ సమయానికి భారత్ స్కోరు ఎంతంటే?
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌ను యశస్వి, పంత్ ఆదుకున్నారు. లంచ్ విరామం వరకు వికెట్ కోల్పోకుండా నియంత్రణతో ఆడారు. భారత జట్టు 23 ఓవర్లలో 88 పరుగులు చేయగా యశస్వి(37), పంత్(33) క్రీజులో ఉన్నారు.