News May 20, 2024
సీఎం ఆదేశించినా అమలు కావడం లేదు

TG:తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవ్వడంలేదు. తడిసిన ధాన్యం కొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. CM ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
Similar News
News December 11, 2025
నేడు ఆ స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ పాఠశాలలను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లకు గానూ నిన్న కూడా ఈ పాఠశాలలకు హాలిడే ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13, 14.. 16, 17 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఆయా బడుల్లో అదనపు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.
News December 11, 2025
భవానీ దీక్షల విరమణ.. భారీ ఏర్పాట్లు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ మండల దీక్ష విరమణ ప్రారంభం కానుంది. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి AP, TGతోపాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి 7L మంది భవానీలు వచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ కోసం 9KM మార్గాన్ని సిద్ధం చేశారు. దర్శనం కోసం 13 కౌంటర్లు, 3 హోమగుండాలు, నిత్యాన్నదానం, రైల్వే, బస్ స్టాండ్ల నుంచి బస్సులు ఏర్పాటు చేశారు.
News December 11, 2025
రుణ విముక్తి కోసం రేపు ఇలా చేయండి: పండితులు

రుణబాధలు తొలగిపోవాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కనకధారా స్తోత్రం చదివి, పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే ఆర్థిక బాధలు పోతాయంటున్నారు. ‘మహిళలు స్నానం చేసే, ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వేయాలి. ఫలితంగా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణ విముక్తి కూడా కలుగుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందాలంటే పూజా మందిరంలో కూర్మం(తాబేలు) ఉంచండి’ అని సూచిస్తున్నారు.


