News May 20, 2024
సీఎం ఆదేశించినా అమలు కావడం లేదు
TG:తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలవ్వడంలేదు. తడిసిన ధాన్యం కొనేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా.. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి, మొలకలు వస్తున్నా.. అధికారుల్లో చలనం లేదు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. CM ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కర్షకులు కోరుతున్నారు.
Similar News
News December 13, 2024
సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తున్నారు: కిషన్ రెడ్డి
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. షో నిర్వాహకులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టు జరిగినట్లు అర్థం అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేస్తోందనే విషయాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని ట్వీట్ చేశారు.
News December 13, 2024
అల్లు అర్జున్‌కు కోర్టు కీలక ఆదేశాలు
సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంది. తదుపరి విచారణను JAN 11కు వాయిదా వేసింది. అలాగే క్వాష్ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యానికి ఇవే ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.
News December 13, 2024
బౌలర్‌ని కాదు.. బంతినే చూస్తాం: గిల్
ఆస్ట్రేలియాపై ఆడేందుకు భయపడట్లేదని భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. ‘గెలవకపోవడం వల్ల భయపడుతున్నామంటే అర్థం ఉంది. మేం చివరిగా ఇక్కడ ఆడినప్పుడు గెలిచాం. భారత్‌లోనూ ఆస్ట్రేలియాను ఓడించాం. బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్నది మా జనరేషన్ పట్టించుకోదు. కేవలం బంతినే చూస్తుంది. ఓ టీమ్‌గా ఎలా పోరాడాలన్నదానిపైనే ప్రస్తుతం జట్టు దృష్టిపెట్టింది. మా దృష్టిలో ఇక ఇది 3 టెస్టుల సిరీస్’ అని పేర్కొన్నారు.