News November 29, 2024

గుండె లేకపోయినా..!

image

ఎవరైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ‘అబ్బా.. నీకు హార్ట్ లేదబ్బా’ అని ఎదుటి వ్యక్తులు అంటుంటారు. అయితే, నిజంగానే హార్ట్ లేని వ్యక్తి గురించి మీకు తెలుసా? 2011లో క్రైగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తికి అమిలోయిడోసిస్‌ కారణంగా గుండె, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యాయి. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ వైద్యులు అతనికి గుండెకు బదులు ఓ పరికరాన్ని అమర్చి మరికొన్నిరోజులు బతికేలా చికిత్స చేశారు.

Similar News

News December 4, 2024

వారిని ఎస్సీల్లో చేర్చండి.. కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ

image

AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News December 4, 2024

అస్సాంలో బీఫ్ తినడంపై బ్యాన్

image

అస్సాంలో బీఫ్ (గొడ్డు మాంసం)పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. ఇది వరకు ఆలయాల దగ్గర ఈ నిషేధం విధించామని, ఇప్పుడా నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు.

News December 4, 2024

అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్‌లో భారత సంస్థ!

image

ప్రపంచ ఎయిర్‌లైన్స్‌లో ఈ ఏడాది అత్యుత్తమైనవి, చెత్తవాటితో కూడిన జాబితాను ఎయిర్‌హెల్ప్ సంస్థ రూపొందించింది. సమయపాలన, ప్రయాణికుల సంతృప్తి తదితర అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అత్యంత చెత్త ఎయిర్‌లైన్‌గా 109వ స్థానంలో టునీస్‌ఎయిర్ నిలవగా 103వ స్థానంలో భారత ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ఉంది. అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్, ఖతర్ ఎయిర్‌వేస్ తొలి 2 స్థానాలు దక్కించుకున్నాయి.