News September 29, 2024

టికెట్ లేకున్నా శ్రీవారిని దర్శించుకోండిలా..!

image

కొంతమందికి అప్పటికప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. సాధారణంగా 2, 3 నెలల ముందే దర్శనానికి టికెట్లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోనివారి కోసం TTD గత కొన్నేళ్లుగా టైమ్ స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) విధానాన్ని అమలు చేస్తోంది. రోజూ ఉదయం 3 గంటలకు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ వద్ద టికెట్లు ఇస్తారు. వీటిని తీసుకొని ఆ టైమ్‌లో దర్శనానికి వెళ్లొచ్చు.

Similar News

News October 13, 2024

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!

image

ఈ దీపావ‌ళికి దేశీయ మార్గాల్లో విమాన‌ టికెట్ల ధ‌ర‌లు సగటున 20-25% త‌గ్గిన‌ట్టు ప‌లు సంస్థ‌లు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై వ‌న్ వేలో ఈ స‌గ‌టు త‌గ్గింపు ధ‌ర‌లు వ‌ర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య‌, ఇంధ‌న ధ‌ర‌ల తగ్గింపు వల్ల ధ‌ర‌లు దిగొచ్చిన‌ట్టు అంచ‌నా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.

News October 13, 2024

బాబర్‌ను తప్పిస్తారా..? భారత్‌ను చూసి నేర్చుకోండి: పాక్ క్రికెటర్

image

ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టులకు బాబర్ ఆజమ్‌ను పాక్ క్రికెట్ బోర్డు తప్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆటగాడు ఫఖార్ జమాన్ ట్విటర్లో మండిపడ్డారు. ‘బాబర్‌ను తప్పించడమేంటి? 2020-23 మధ్యకాలంలో విరాట్ సగటు ఎంత తక్కువగా ఉన్నా భారత్ అతడిని తప్పించలేదు. మన దేశంలోనే అత్యుత్తమ బ్యాటరైన బాబర్‌ను తప్పించడం జట్టుకు తప్పుడు సంకేతాల్నిస్తుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

News October 13, 2024

బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. భారీగా జీతం

image

హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ (HURL)లో 212 డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి. కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: డిప్లొమా/బీఈ/బీటెక్. జీతం: రూ.23,000 నుంచి రూ.1,40,000. పూర్తి వివరాలకు <>సైట్<<>>: https://hurl.net.in/