News November 4, 2024
హీరోయిన్‌ను కూడా హీరోలే డిసైడ్ చేస్తారు: తాప్సీ
సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.
Similar News
News December 9, 2024
మెక్సికో, కెనడాలు అమెరికాలో విలీనమవడం బెటర్: ట్రంప్
పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలకు అందిస్తున్న రాయితీలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ‘కెనడాకు ఏటా $100B, మెక్సికోకు $300B సబ్సిడీ ఇస్తున్నాం. అసలు ఈ దేశాలకు ఎందుకు ఇవ్వాలి? దాని కంటే ఆ రెండు అమెరికాలో రాష్ట్రాలుగా విలీనమైతే మంచిది’ అని వ్యాఖ్యానించారు. అక్రమ వలసదారులను కట్టడి చేయకపోతే ఆ దేశాల దిగుమతులపై భారీ పన్నులు విధిస్తామని ఇటీవల ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
News December 9, 2024
తులం బంగారం హమీపై మంత్రి ఏమన్నారంటే?
TG: కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. పెండింగ్ హామీల అమలుకు కసరత్తు జరుగుతోందని మంత్రి వివరించారు. పదేళ్లలో BRS చేయని ఎన్నోపనులను కాంగ్రెస్ ఏడాదిలోనే చేసిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News December 9, 2024
WTCలో అత్యధిక విజయాలు ఈ జట్టువే
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకూ అత్యధిక విజయాలు సాధించిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఆ జట్టు 64 మ్యాచుల్లో 32 గెలిచింది. రెండో స్థానంలో భారత జట్టు (53 మ్యాచుల్లో 31 విజయాలు), మూడో స్థానంలో ఆస్ట్రేలియా (48 మ్యాచుల్లో 29 విన్స్) ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్ (18), సౌతాఫ్రికా (18), శ్రీలంక (12), పాకిస్థాన్ (12), వెస్టిండీస్ (9) ఉన్నాయి.