News March 13, 2025
ఆమెతో డేటింగ్‌లో ఉన్నా: స్టార్ హీరో

గౌరీ స్ప్రత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రకటించారు. తన 60వ బర్త్‌డే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 25 ఏళ్లుగా గౌరీతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన ఆమె ఆమిర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేస్తున్నారు. గౌరీకి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. 2021లో తన భార్య కిరణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్నారు. అంతకుముందు రీనా దత్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు.
Similar News
News March 9, 2026
విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.
News March 9, 2026
‘జీ రామ్ జీ’కి లోగో డిజైన్ చేస్తే ₹50వేలు!

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి ₹50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలని అనుకునేవారు <
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.


