News February 24, 2025

ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో మార్పు రాలేదు: రేవంత్

image

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 26, 2025

రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

image

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.

News March 26, 2025

IPL: రషీద్ ఖాన్ ఖాతాలో మరో మైలురాయి

image

IPLలో అతి తక్కువ మ్యాచుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్న బౌలర్ల జాబితాలో GT స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో నిలిచారు. 122 మ్యాచుల్లో ఆయన ఈ ఘనతను సాధించారు. తొలి రెండు స్థానాల్లో మలింగా (105), చాహల్ (118) ఉన్నారు. 4, 5, 6 స్థానాల్లో బుమ్రా (124), బ్రావో (137), భువనేశ్వర్ కొనసాగుతున్నారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల లిస్టులో చాహల్ (205) టాప్‌లో ఉండగా, రషీద్ 11వ స్థానానికి చేరారు.

News March 26, 2025

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలు ఇవే

image

☛ 5 ఏళ్లలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి
☛ కుటుంబాల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, పల్లెల్లో రూ.1.50లక్షలలోపు ఉండాలి
☛ రేషన్ కార్డు లేకపోతే ఇన్‌కం సర్టిఫికెట్ సమర్పించాలి
☛ మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
☛ అమరవీరుల కుటుంబాలు, స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యత
☛ <>ఆన్‌లైన్‌లో<<>> మాత్రమే దరఖాస్తులు

error: Content is protected !!