News March 19, 2024
సాయంత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్
హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల పవన్ డబ్బింగ్ చెబుతున్నట్లుగా ఫొటో బయటికొచ్చిన నేపథ్యంలో.. మూవీ టీజర్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 12, 2024
శరవేగంగా వారణాసి స్టేడియం పనులు
వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూ.441 కోట్ల అంచనా వ్యయంతో ఈ మైదానాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 7 పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో అత్యాధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. ఢమరుకం, త్రిశూలం ఆకారాలతో అడుగడుగునా శివతత్వం ఉట్టిపడేలా BCCI, UPCA దీనిని నిర్మిస్తున్నాయి.
News September 12, 2024
YCP MP మిథున్ రెడ్డి బర్త్ డే వేడుకల్లో ఉద్రిక్తత
AP: రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు జిల్లా సదుం మండలం పెద్దూరులో జరిగిన ఎంపీ బర్త్ డే వేడుకల సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నాయి. ఈ గొడవలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News September 12, 2024
వినాయక చవితి వేడుకల్లో హిట్‌మ్యాన్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వినాయక చవితి వేడుకల్లో సందడి చేశారు. తన ఇంట్లోనే గణపతి విగ్రహం ప్రతిష్ఠించి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం హిట్‌మ్యాన్ సిద్ధమవుతున్నారు. ఎక్కువసేపు జిమ్, మైదానంలోనే ఆయన గడుపుతున్నారు.