News May 10, 2024
అప్పటి నుంచీ ప్రతిరోజూ యుద్ధమే: ఖలీల్

ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ఖలీల్ అహ్మద్ 2019 నవంబరులో చివరిగా భారత్ తరఫున ఆడారు. ఆ తర్వాత తెరమరుగయ్యారు. ఇన్నేళ్లకు మళ్లీ టీమ్ ఇండియా తరఫున వరల్డ్ కప్‌నకు ఎంపికయ్యారు. ‘గత నాలుగున్నరేళ్లుగా చాలా ఇబ్బంది పడ్డాను. అప్పటి నుంచి మానసికంగా ప్రతిరోజూ ఒక యుద్ధమే చేశాను. మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతోనే ఉన్నా. ఇన్నేళ్లకు భారత జట్టులో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకో ముందడుగు’ అని తెలిపారు.
Similar News
News February 14, 2025
రూ.7.5 కోట్ల జీతం.. అయినా జీవితం శూన్యం: టెకీ ఆవేదన

వారానికి 70, 90hr పనిచేయాలంటూ కంపెనీల దిగ్గజాలు ఉచిత సలహాలిస్తున్న వేళ ఓ టెకీ ఆవేదన ఆలోచింపజేస్తోంది. తాను రోజూ 14hr పనిచేస్తూ ₹7.5Cr జీతం తీసుకుంటున్నా మ్యారేజ్ లైఫ్ విషాదాంతమైందన్నారు. ‘కూతురు పుట్టినప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నా. డిప్రెషన్‌లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయా. ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుతోంది. కెరీర్‌లో ఎంతో సాధించినా జీవితం శూన్యంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.
News February 14, 2025
ఒడిశా హైకోర్టులో ‘పద్మశ్రీ’ పంచాయితీ!

ఒడిశా హైకోర్టుకి ఓ వింత పంచాయితీ చేరింది. అంతర్యామి మిశ్రా అనే పేరున్న వ్యక్తికి 2023లో సాహిత్య విభాగంలో కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆ పేరు కలిగిన జర్నలిస్టు ఢిల్లీ వెళ్లి పురస్కారం స్వీకరించారు. అయితే, అది తనకు ప్రకటిస్తే వేరే వ్యక్తి తీసుకున్నారని అదే పేరు కలిగిన వైద్యుడు హైకోర్టుకెక్కారు. దీంతో వారిద్దరినీ వారి వారి రుజువులతో తదుపరి విచారణకు కోర్టులో హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
News February 14, 2025
రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.