News March 29, 2024
ప్రతి ప్లేయర్‌ను గౌరవించాలి.. వారే మన హీరోలు: సోనూసూద్
MI కెప్టెన్‌ను మార్చడంతో హార్దిక్‌పై రోహిత్ ఫ్యాన్స్ ద్వేషాన్ని పెంచుకున్నారు. ఈక్రమంలో నటుడు సోనూసూద్ ఫ్యాన్స్‌కు పలు సూచనలు చేశారు. ‘మన దేశాన్ని గర్వపడేలా చేసిన ఆటగాళ్లను మనం గౌరవించాలి. ప్రతి భారత క్రికెటర్‌ని నేను ప్రేమిస్తున్నాను. ప్లేయర్ ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడన్నది ముఖ్యం కాదు. కెప్టెన్‌గా ఆడినా 15వ ప్లేయర్ అయినా సరే. వారే మన హీరోలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 22, 2025
సంతోషకరమైన దేశాల్లో ఇండియా ఏ స్థానమంటే?
ప్రపంచంలో సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఫిన్లాండ్ నిలిచింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్-2024 ప్రకారం టాప్-100లో ఇండియా లేకపోవడం గమనార్హం. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా టాప్-10 హ్యాపీయెస్ట్ కంట్రీస్‌గా నిలిచాయి. ఇండియా 126వ స్థానంలో ఉంది. ఇండియా ఈ ప్లేస్‌లో ఉండటానికి గల కారణాలేంటో మీకు తెలుసా?
News January 22, 2025
పీవీ సింధు పరాజయం
ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. వుమెన్స్ సింగిల్స్‌లో వియత్నాం క్రీడాకారిణి గుయెన్ టీఎల్ చేతిలో 20-22, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయారు. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం ప్రదర్శించలేకపోయారు. అంతకుముందు ఇండియా ఓపెన్‌లోనూ సింధు ఓడిపోయారు.
News January 22, 2025
శారదా పీఠం భవనం కూల్చేందుకు ఆదేశాలిస్తాం: హైకోర్టు
AP: తిరుమలలోని శారదా పీఠం భవన నిర్మాణంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. భవనం కూల్చివేతకు ఆదేశాలిస్తామని తెలిపింది. అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఓ ఉదాహరణ కావాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠాన్ని ఆదేశించింది.