News March 23, 2024

ప్రతి స్థానం కీలకమే: పవన్

image

AP: పి.గన్నవరంలో కచ్చితంగా జనసేనే గెలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించిన జనసేనాని.. నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘స్థానిక ఎన్నికల్లో YCP వాళ్లు దౌర్జన్యాలకు పాల్పడి, కనీసం నామినేషన్ వేయనివ్వలేదు. అయినా సత్తా చాటాం. ఇదే స్ఫూర్తిని ఇప్పుడు చూపించాలి. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే’ అని తెలిపారు.

Similar News

News September 19, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.

News September 19, 2024

జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?

image

జమిలీ ఎన్నిక‌ల కోసం చేయాల్సిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌కు పార్ల‌మెంటులో 2/3 వంతు స‌భ్యుల ఆమోదం అవ‌స‌రం. NDAకి ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్ద‌తు ఏ మాత్రం స‌రిపోదు. అద‌నంగా స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌స‌భ‌లో NDAకు 293 మంది స‌భ్యుల బలం ఉంటే, స‌వ‌ర‌ణ‌ల ఆమోదానికి 362 మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇక రాజ్య‌స‌భ‌లో 121 మంది బ‌లం ఉంటే, అద‌నంగా 43 మంది స‌భ్యుల బ‌లం అవ‌స‌రం ఉంది.

News September 19, 2024

జ‌మిలి ఎన్నిక‌ల కోసం చేయాల్సిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు

image

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ కాల‌ప‌రిమితికి సంబంధించిన ఆర్టిక‌ల్ 83, 83(2) *అసెంబ్లీల గ‌డువు కుదింపున‌కు ఆర్టికల్ 172 (1) *రాష్ట్ర‌ప‌తి పాల‌న‌కు వీలుక‌ల్పించే ఆర్టిక‌ల్ 356, ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ప‌రిధికి సంబంధించి ఆర్టిక‌ల్ 324 *లోక్‌స‌భ‌, అసెంబ్లీల ముందస్తు ర‌ద్దుకు రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్‌కు అధికారం క‌ల్పించే ఆర్టిక‌ల్ 83(2), 172(1)ను స‌వ‌రించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్పా జమిలి ఎన్నికలు సాధ్యం కావు.