News January 31, 2025

పెద్దిరెడ్డి భూకబ్జాలు అందరికీ తెలుసు: అనగాని

image

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూకబ్జాల గురించి అందరికీ తెలిసిందే అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన పలు జిల్లాల్లో భూకబ్జాలు చేశారని చెప్పారు. మంగళంపేట అటవీభూములు దేనికి వాడుతున్నారో తెలియడం లేదన్నారు. గెస్ట్‌హౌస్‌కా? ఎర్రచందనం అక్రమ రవాణాకా? అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. మంగళంపేట అటవీ భూములపై రెండు వారాల్లో నివేదిక వస్తుందని తిరుపతి పర్యటనలో అనగాని తెలియజేశారు.

Similar News

News November 23, 2025

వాహనదారులకు ప్రకాశం పోలీస్ కీలక సూచనలు.!

image

*హైవేల్లో భారీ ప్రమాదాలకు కారణం నిద్ర మత్తు
*నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ
*మీతోపాటు ప్రయాణికుల, పాదచారుల ప్రాణాలకు ముప్పు
*నిద్రమత్తు అనిపిస్తే వెంటనే వాహనం సైడుకు ఆపి 10-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి
*ప్రయాణం మొదలు పెట్టే ముందు సరిపోయేలా నిద్రపోవాలి
*దీర్ఘ ప్రయాణాల్లో 2 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.
*వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించండి.

News November 23, 2025

అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

image

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.

News November 23, 2025

కుజ దోషం అంటే ఏంటి?

image

ఓ వ్యక్తి జాతక చక్రంలో కుజుడు 1, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే అతనికి కుజ దోషం ఉన్నట్లు పరిగణిస్తారు. జ్యోతిషం ప్రకారం.. ఈ దోషం ఉన్నవారికి బలమైన కోరికలుంటాయి. ఎప్పుడూ అహం, ఆవేశంతో ఊగిపోతారని, వివాహం ఆలస్యంగా అవుతుందని, వైవాహిక జీవితంలో సమస్యలుంటాయని నమ్ముతారు. అయితే వీటన్నింటికీ జ్యోతిష శాస్త్రంలో పరిహారాలున్నాయని పండితులు చెబుతున్నారు.
☞ వాటి గురించి తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.