News November 26, 2024

ఢిల్లీలో నివసించే ప్రతి ఒక్కరి ఊపిరితిత్తులు నాశనం: పరిశోధకులు

image

ఢిల్లీలో కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పౌరుల ఊపిరితిత్తులు కచ్చితంగా ఎంతోకొంతమేర నాశనం అయి ఉంటాయని అశోక యూనివర్సిటీ డీన్, పరిశోధకుడు అనురాగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ స్థాయి కాలుష్యం వలన ఆరోగ్యవంతుల లంగ్స్ కూడా ఇప్పటికే నాశనమవడం ప్రారంభమై ఉంటుంది. ఆల్రెడీ ఆస్తమా, ఇన్ఫెక్షన్లున్నవారి సమస్యలైతే వర్ణనాతీతంగా ఉంటాయి. ఈ కాలుష్యం ఎవర్నీ వదిలిపెట్టదు’ అని హెచ్చరించారు.

Similar News

News November 26, 2024

పుష్ప-2 షూటింగ్ పూర్తి.. అల్లు అర్జున్ పోస్ట్

image

పుష్ప-2 షూటింగ్ పూర్తైనట్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. పుష్ప లాస్ట్ డే షూట్ అంటూ బన్నీ ఓ ఫొటోను పంచుకున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన సీన్ షూటింగ్ ఇవాళ జరిగినట్లు ఈ ఫొటో ద్వారా తెలుస్తోంది. ‘పుష్ప యూనిట్‌తో ఐదేళ్ల ప్రయాణం ముగిసింది. అద్భుతమైన ప్రయాణం’ అంటూ లవ్ సింబల్‌ను ఆయన పోస్ట్ చేశారు. కాగా డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.

News November 26, 2024

29న ఛాంపియన్స్ ట్రోఫీపై ఫైనల్ డెసిషన్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఈ నెల 29న ICC తుది నిర్ణయం వెలువరించనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్, భారత్ పర్యటన, హైబ్రిడ్ మోడల్ వంటి విషయాలపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తుందని సమాచారం. కాగా హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరిస్తే ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచుతామని ICC ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్ మ్యాచులను UAEలో నిర్వహించాలని, ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో జరపాలని పాక్‌ను కోరినట్లు సమాచారం.

News November 26, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం రేపటికి తుఫానుగా బలపడుతుందని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. రేపు NLR, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. ఎల్లుండి కాకినాడ, కోనసీమ, కృష్ణా, NLR, YSR, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, TPTY జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంది.