News May 25, 2024
రుణమాఫీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 9 కటాఫ్?

TG: రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది. కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేయనున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువుంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్నీ కలిపి లెక్కించనున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న అప్పు కూడా మాఫీ కానుంది. దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని టాక్.
Similar News
News February 10, 2025
బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్

AP: ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ రోజున ఉ.10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కాగా 15 రోజులపాటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28న రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.
News February 10, 2025
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.