News May 19, 2024
ఐదో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం
లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు 8 రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో బిహార్, హరియాణా, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Similar News
News December 2, 2024
ఎల్లుండి ప్రోబా-3 ప్రయోగం
ఈ నెలలో ఇస్రో 2 ప్రయోగాలను చేపట్టనుంది. PSLV C59 రాకెట్ ద్వారా ESAకు చెందిన ప్రోబా-3 అనే శాటిలైట్‌ను 4వ తేదీన సా.4.08 గంటలకు ప్రయోగించనుంది. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనుంది. స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొననున్నారు. అలాగే 24వ తేదీన రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.
News December 2, 2024
పరువు హత్య.. మహిళా కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు!
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు.
News December 2, 2024
వడ్డించే వాడు మనవాడయితే..
ప్రపంచ పెద్దన్న అమెరికా రాజకీయాల్లోనూ బంధుప్రీతి పరిఢవిల్లుతోంది. త్వరలో అధ్యక్షుడయ్యే డొనాల్డ్ ట్రంప్ తన కూతురు టిఫానీ మామను పశ్చిమాసియా సలహాదారుగా నియమించారు. ఇజ్రాయెల్‌కు USA మద్దతుతో గుర్రుగా ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను ట్రంప్ వైపు ఈ వియ్యంకుడు మసాద్ బౌలోస్ మళ్లించారు. ఇక త్వరలో గద్దె దిగే జో బైడెన్ తన కుమారుడు <<14766211>>హంటర్‌పై<<>> గల అక్రమ ఆయుధాలు, IT కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించడం తెలిసిందే.